గాంధీనగర్: గుజరాత్‌లోని కచ్ తీరంలో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఓ నౌకలో రూ. వెయ్యి కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన భారీ యాంటీ- డ్రగ్స్ ఆపరేషన్‌లో 100 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. వెయ్యి కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్‌లోని ‘పోర్ట్ ఖాసిం’ నుంచి వచ్చినట్టు భావిస్తున్న యూరోపియన్ నౌకను భద్రతా సంస్థలు అడ్డుకుని, తనిఖీలు చేయడంతో ఈ నెట్‌వర్క్ బయటపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒకరిని అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ డ్రగ్స్ ఏ రూట్ ద్వారా వచ్చాయి? దీని వెనుక ఉన్న లాజిస్టిక్స్ చైన్ ఏంటి? దీనిని నడిపిస్తున్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
