ఇండియా అంటే ఇదీ.. సముద్రంలో19 మంది పాకిస్తానీయులను కాపాడిన మన సోల్జర్స్

ఇండియా అంటే ఇదీ.. సముద్రంలో19 మంది పాకిస్తానీయులను కాపాడిన మన సోల్జర్స్

ఇండియా అంటే నిత్యం విషం చిమ్మే పాకిస్తానీయులు.. ఇప్పుడు జయహో ఇండియా అంటున్నారు. నడి సముద్రంలో.. సముద్ర దొంగల చేతిలో చిక్కిన 19 మంది పాకిస్తానీయులను.. మన నేవీ యుద్ధనౌక INSలోని సోల్జర్స్ కాపాడారు. ఆపదలో ఉంటే వాళ్లు మనోళ్లా.. పగోళ్లా.. శత్రువులా అని చూడకుండా.. సోమాలియా సముద్రపు దొంగల నుంచి పాకిస్తానీయులను కాపాడటం మన సోల్జర్స్ కే సాధ్యం అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

సొమాలియా తూర్పు తీరంలో ఇండియన్ నేవీ మరోసారి తన ప్రతిభ చాటింది. రెండు రోజుల వ్యవధిలోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 8 వందల మైళ్ల దూరంలో పైరెట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. హైజాక్ అయిన నౌకలో 19 మంది పాకిస్తాన్ నావికులు ఉన్నారు. వారందర్ని రక్షించినట్టు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌక ఆ రెస్క్యూ ఆఫరేషన్ ను విజయవంతంగా నిరవహించిందని ఇండియన్ నేవీ తెలిపింది. 

 
రెండు రోజుల క్రితం యెమెన్‌లో ఇరాన్-మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఓ ఓడ పై క్షిపుణిని వదిలారు. దీంతో ఓడ దగ్ధమౌతుండటంతో భారత నావికాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్  విశాఖపట్నం తక్షణ సహాయం అందించింది. న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్   టీమ్‌తో మరియు ఫైర్ సిబ్బందితో కలిసి వెళ్లి అక్కడ పెద్ద విపత్తును తప్పించారు. ఈ ఓడలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇక నేవీ దళాలు విడుదల చేసిన ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శత్రు దేశాన్ని సైతం ప్రేమించే దేశం భారతదేశమని కామెంట్ చేస్తున్నారు.