
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.
పోస్టుల సంఖ్య: 537.
పోస్టులు: ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ 156, వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ 152, నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్ 97, సౌతర్న్ రీజియన్ పైప్‌లైన్స్ 47, సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ 85.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 29.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు iocl.com వెబ్సైట్లో సంప్రదించగలరు.