ఇండియన్ ఓపెన్ స్క్వాష్ చాంప్స్‌‌ అనాహత్, అభయ్‌‌

ఇండియన్ ఓపెన్ స్క్వాష్ చాంప్స్‌‌  అనాహత్, అభయ్‌‌

చెన్నై:  ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్‌‌లో  అనాహత్ సింగ్, అభయ్ సింగ్ డబుల్ ధమాకా మోగించారు. సొంతగడ్డపై అంచనాలను అందుకున్న ఈ ఇద్దరూ టైటిళ్లు సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన విమెన్స్ ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11-–5, 11-–6, 9–-11, 11-–6తో ఈజిప్ట్ ప్లేయర్ హనా మోతాజ్‌‌ను చిత్తు చేసింది. 

ఇటీవల కెరీర్ బెస్ట్ వరల్డ్ ర్యాంక్ (19) సాధించిన అనాహత్, ఈ విజయంతో టాప్-–20లో తన ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంది. మరోవైపు, మెన్స్ సింగిల్స్‌‌లో ఇండియా నంబర్ వన్ అభయ్ సింగ్  11–-7, 12–-10, 11–-4తో తోటి ప్లేయర్  వీర్ చోట్రానిపై విజయం సాధించాడు. దాంతో కెరీర్‌‌లో తొలి పీఎస్ఏ టూర్  టైటిల్‌‌ సొంతం చేసుకున్నాడు.