కెనడాలో ఇండియా కుటుంబం సజీవ దహనం

కెనడాలో ఇండియా కుటుంబం సజీవ దహనం

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన మృత దేహాలకు పరీక్షలు జరిపారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్‌ వరికూ (51), అతని భార్య శిల్ప కొత్త (47) వారి కుమార్తె మహెక్‌ వరికూ (16)గా నిర్ధారించారు.

ఈ నెల 7న బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారని పోలీసులు చెప్పారు.  ఘటన పై తమకు అనుమానంగా ఉందని అందుకే సమగ్ర విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు.  ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు.

దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఘటన పై స్థానికులు స్పందిస్తూ  తామకు భారీ శబ్ధం వినిపించి ఇంటి నుంచి బయటకు వచ్చి చూసామని ఇంతలోనే ఇంట్లో మంటలు చెలరేగాయని తెలిపారు.  కొన్ని గంటల్లో, ప్రతిదీ నేలమీద పడిందని ఇళ్లు పూర్తిగా దగ్ధమైందని చెప్పారు.