
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ సాధించిన అనూహ్య విజయం అమెరికా రాజకీయాల్లో కీలక మలుపును సూచిస్తుంది. ఈ విజయం మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో వంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి డెమోక్రటిక్ పార్టీలో లోతైన సైద్ధాంతిక విభేదాలను బహిర్గతం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఈ విజయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మమ్దానీని 100శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు అని విమర్శించారు.
జోహ్రాన్ మమ్దానీ 33 ఏళ్ల వామపక్ష సోషలిస్ట్.2021 నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. అతను ఎన్నికైతే న్యూయార్క్ నగరానికి మొదటి ముస్లిం,భారతీయ అమెరికన్ మేయర్ అవుతారు. అతను ప్రఖ్యాత భారతీయ అమెరికన్ చిత్రనిర్మాత మీరా నాయర్ ,భారతీయ సంతతికి చెందిన ఉగాండా మార్క్సిస్ట్ పండితుడు మహమూద్ మమ్దానీ కుమారుడు. అతను ఉగాండాలో జన్మించి న్యూయార్క్ నగరంలో పెరిగారు. 2018లో మామ్దానీ US పౌరుడు అయ్యారు. మమ్దానీ తనను తాను "ప్రగతిశీల ముస్లిం వలసదారుడు.. నమ్మిన వాటి కోసం నిజంగా పోరాడుతాను అని స్వయంగా ప్రకటించాడు.
మమ్దానీ విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో మామ్దానీని లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్. అతనిని 100శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు అని అభివర్ణించారు. గతంలో రాడికల్ లెఫ్టీలు ఉన్నారు.. కానీ మామ్దాని విజయం కొంచెం హాస్యాస్పదంగా ఉందన్నారు. మమ్దానీ మేయర్ అయితే అమెరికా నాశనం అవుతుంది అని తీవ్ర హెచ్చరిక చేశారు.మామ్దానీకి మద్దతు ఇవ్వడంతో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ చక్ షుమెర్ వంటి ప్రముఖ డెమోక్రటిక్ నేతలను కూడా విమర్శించారు ట్రంప్.
మమ్దానీ - భారతీయ సంతతికి చెందిన ముస్లిం.ప్రఖ్యాత భారతీయ అమెరికన్ చిత్రనిర్మాత మీరా నాయర్ ,భారతదేశంలో జన్మించిన ఉగాండా మార్క్సిస్ట్ పండితుడు మహమూద్ మమ్దానీ కుమారుడు.- న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో న్యూయార్క్ మేయర్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. మమ్దానీ 43.5 శాతం ఓట్లను గెలుచుకున్నారు. 90 శాతం బ్యాలెట్లు లెక్కించారు. మమ్దానీ చివరి రేసులో గెలిస్తే అతను న్యూయార్క్ మొదటి ముస్లిం మేయర్ అవుతాడు.
ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా క్వీన్స్ బరోకు ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్దానీ తన ఆకర్షణీయమైన విధాన ప్రతిపాదనలలో చాలా మంది న్యూయార్క్ వాసులకు దగ్గరయ్యాడు. అద్దెను తగ్గించడం, ఉచిత బస్సు సేవ, సార్వత్రిక పిల్లల సంరక్షణ వంటి ప్రాతిపాదనలతో ఆకట్టుకున్నాడు. న్యూయార్క్ నగరంలో అద్దెలు బీభత్సంగా ఉన్నాయి. ట్రిపుల్ బెడ్ రూం అపార్ట్మెంట్ నెలకు 6వేల డాలర్ల కంటే ఎక్కువే. మామ్దానీ అద్దెల ప్రతిపాదన మేసేజ్ న్యూయార్క్ వాసులందరినీ ఆకట్టుకుంటోంది