స్పెయిన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన భారత రేసర్ కవిన్ క్వింటాల్

స్పెయిన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన భారత రేసర్ కవిన్ క్వింటాల్

జెరెజ్ (స్పెయిన్): భారత బైక్ రేసర్ కవిన్ క్వింటాల్ 2026 కోపా డి ఎస్పానా డి వెలోసిడాడ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. ఇక్కడ జరిగిన తొలి రౌండ్ సూపర్ బైక్ 1000 సీసీ కేటగిరీ పోటీల్లో అతడు రెండు పతకాలు కైవసం చేసుకున్నాడు. బీఎమ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఈజీరేస్ టీమ్‌‌‌‌‌‌‌‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 21 ఏళ్ల చెన్నై రైడర్.. శనివారం 33 మందితో సాగిన రేస్ 1 లో రెండో స్థానంలో నిలిచాడు.

స్పెయిన్ ఆటగాడు జువాన్ మారియా కంటే కేవలం 0.605 సెకన్ల వెనుకంజలో విజయాన్ని చేజార్చుకున్నాడు. అదే జోరుతో ఆదివారం జరిగిన రేస్ 2 లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది వైల్డ్‌‌‌‌‌‌‌‌కార్డ్ ఎంట్రీ అరంగేట్రంలోనే నాలుగో స్థానంతో ఆకట్టుకున్న కవిన్‌‌‌‌‌‌‌‌ను ఈ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో స్పెయిన్ టీమ్ తమ జట్టులోకి తీసుకుంది.