రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాన్ ఏసీ స్లీపర్ కోచ్ లో కూడా బెడ్ షీట్లు, పిల్లోస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాన్ ఏసీ స్లీపర్ కోచ్ లో  కూడా బెడ్ షీట్లు, పిల్లోస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే ప్రయాణికుల కోసం  కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. ఇప్పటివరకు ఏసీ కోచ్ లలో మాత్రమే అందుబాటులో ఉన్న బెడ్ షీట్లు, పిల్లోస్ సౌకర్యం.. ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ కోచ్ లలో కూడా అందుబాటులోకి రానుంది. తొలిసారి దక్షిణ రైల్వే పరిధిలోని చైన్నై  రైల్వే డివిజన్ బెడ్ షీట్లు, పిల్లోస్ ను అందిస్తోంది.  ఈ సౌకర్యాన్ని ఆన్ డిమాండ్ ఆన్ పేమెంట్ మోడ్ లలో పొందవచ్చు. 

ప్రయాణికులకు మెరుగైన సేవలందిచే క్రమంలో దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ నాన్ ఏసీ కోచ్ లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు జనవరి 1 నుంచి దిండ్లు, బెడ్ షీట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన పది రైళ్లలో మూడేళ్ల పాటు ఈ కొత్త సౌకర్యాలను అమలు చేస్తారు. గతంలో AC కోచ్ లలో మాత్రమే  ఈ సౌకర్యం ఉండేది. 

వర్షాకాలం, శీతాకాలంలో రిలాక్స్డ్ , పరిశుభ్రమైన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేస్తోంది. దీంతో ప్రయాణీకులకు సుదూర ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. 

దుప్పట్లు, దిండ్ల నిర్వహణ పంపిణీని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు  అప్పగిస్తారు. -సేకరణ, యాంత్రిక వాషింగ్, ప్యాకింగ్, లోడింగ్, పంపిణీ ,నిల్వ - సేవా వ్యవధి అంతటా పరిశుభ్రత,సరఫరా చేయాల్సి ఉంటుంది. సుమారు రూ. 28.27 లక్షల వార్షిక లైసెన్స్ ఫీజులో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తారు.  

దిండుతో కూడిన కవర్ ను రూ.30 కి, బెడ్ షీట్ కు రూ.20కి రెంట్ చెల్లించి తీసుకోవచ్చు.  రెండూ కావాలంటే రూ. 50 లకు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి మొత్తం పది రైళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని జోన్లలో ఈ సౌకర్యాన్ని అమలు చేసే అవకాశం ఉంది.