జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్లో మను బాకర్కు గోల్డ్

జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్లో మను బాకర్కు గోల్డ్

నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్లో ఇండియన్ స్టార్ షూటర్ మను బాకర్ స్వర్ణ పతకం సాధించింది. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో తెలంగాణ షూటర్ ఇషాపై 17–13 స్కోరు తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫికేషన్‌లో మను 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో  తెలంగాణ షూటర్ ఇషా సింగ్ సిల్వర్ సొంతం చేసుకుంది. మొత్తంగా 576 పాయింట్లతో ఇషా సింగ్ 5వ స్థానంలో నిలిచింది. 

అటు ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కర్ణాటకకు చెందిన దివ్య విజేతగా నిలిచింది. ఫైనల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన సంస్కృతి 16–14 పాయింట్ల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ ను అందుకుంది. ఈ విభాగంలో సంస్కృతి సిల్వర్ ను దక్కించుకోగా..హర్యానాకు చెందిన రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకాన్ని సాధించింది. క్వాలిఫికేషన్ లో 254.2 పాయింట్లతో దివ్య మొదటి స్థానంలో నిలిచింది. సంస్కృతి 251.5 రెండో స్థానాన్ని సాధించింది.