లండన్ లో తెలుగు యువకుడు మృతి

లండన్ లో తెలుగు యువకుడు మృతి

లండన్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లాండ్ లండన్‌‌‌‌‌‌‌‌లోని క్రోయ్‌‌‌‌‌‌‌‌డాన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు గొంతి అభిషేక్ (28) మృతి చెందాడు. అభిషేక్ మృతి చెందినట్లు యూకే కాన్సులేట్ ఆయన కుటుంబ సభ్యులకు బుధవారం తెలియజేసింది. కాకినాడ జిల్లా కొండయ్యపేటకు చెందిన అభిషేక్.. ఎంబీఎ చేసేందుకు మూడేండ్ల క్రితం లండన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. 

చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం సొంతూరికి వచ్చి వెళ్లాడు. అభిషేక్ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని అతని తల్లిదండ్రులు  ప్రభుత్వాన్ని కోరారు. కాగా..ఈ ప్రమాదంలో అభిషేక్ తో పాటు కలిసి నివసిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు.