ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి

ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి

మెల్​బోర్న్: విదేశాల్లో ఉన్న మన స్టూడెంట్లపై ఖలిస్తానీ సపోర్టర్ల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టూడెంట్ పై దాడి చేశారు. అతడు ఖలిస్తానీ వేర్పాటువాదులను వ్యతిరేకిస్తున్నాడని ఇనుప రాడ్లతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దీంతో బాధిత స్టూడెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన సిడ్నీకి దగ్గర్లోని మేరీల్యాండ్స్ లో జరిగింది. 

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ స్టూడెంట్ (23) కారు డ్రైవర్ గానూ పని చేస్తున్నాడు. అతను శుక్రవారం డ్యూటీకి వెళ్తున్న టైమ్​లో ఖలిస్తానీ సపోర్టర్లు దాడి చేశారు. ‘‘నేను ఉదయం 5:30 గంటలకు డ్యూటీకి బయలుదేరాను. కారు స్టార్ట్ చేస్తుండగా నలుగురైదుగురు నా దగ్గరికి వచ్చారు. కారు డోర్ తీసి నన్ను బయటకు లాగారు. ఇనుప రాడ్లతో దాడి చేశారు. 

నన్ను కొడుతున్నంతసేపు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఇదంతా ఫోన్​లో రికార్డు చేశారు” అని బాధిత స్టూడెంట్ తెలిపాడు. కేవలం 5 నిమిషాల్లో ఇదంతా జరిగిందని చెప్పాడు. ‘‘ఖలిస్తాన్​ను వ్యతిరేకించినందుకు ఇది నాకో గుణపాఠం కావాలని వాళ్లు చెప్పారు. లేదంటే మరిన్ని గుణపాఠాలు చెబుతామని హెచ్చరించి వెళ్లిపోయారు” అని పేర్కొన్నాడు.