రఘురామ్కు గ్లాస్కో సత్కారం

రఘురామ్కు గ్లాస్కో సత్కారం

పద్మారావునగర్, వెలుగు: కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 425 ఏళ్ల చరిత్ర కలిగిన గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ వారు ఆయనను హానరరీ ఎఫ్‌‌ ఆర్సీఎస్ తో సత్కరించారు. 

ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. స్కాట్​లాండ్​లోని గ్లాస్గోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా ఈ ఫెలోషిప్‌‌ను అందించారు. ఈయన రొమ్ము క్యాన్సర్​చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.