టీఆర్ఎఫ్​ను ఉగ్రసంస్థగా ప్రకటించాలి..యూఎన్​తో భారత్ చర్చలు

టీఆర్ఎఫ్​ను ఉగ్రసంస్థగా ప్రకటించాలి..యూఎన్​తో భారత్ చర్చలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో  టెర్రర్ అటాక్ కు పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం భారత ప్రతినిధుల బృందం యునైటెడ్ నేషన్స్‌‌‌‌ ఉన్నతాధికారులను కలిసింది. ఏప్రిల్ 22 నాటి పహల్గాం ఉగ్రదాడి గురించి వారికి వివరించింది. 26 మంది  అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని లష్కరే తయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకున్న విషయాన్ని యూఎన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. టీఆర్ఎఫ్ పాత్రపై తమ పద్ద ఉన్న సమాచారాన్ని వారికి అందించింది. 2022 ఢిల్లీ డిక్లరేషన్​లో ఆమోదించిన తీర్మానంపైనా భారత బృందం వారితో చర్చించింది.