శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు భారత జట్లు ఎంపిక

శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు భారత జట్లు ఎంపిక

వెస్ట్ ఇండీస్ తో టీ20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా..మరో రెండు దేశాల సిరీస్ లపై కన్నేసింది. శ్రీలంక, ఆస్ట్రేలియాతో త్వరలోనే టీ20, వన్డే మ్యాచ్ లో ఆడనుంది భారత్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం రిలీజైంది. జనవరి- 2020లో లంకతో మూడు టీ20లు.. ఆసీస్‌ తో మూడు వన్డేల్లో భారత్‌ తలపడనున్నట్లు తెలిపింది BCCI.

లంకతో టీ20 సిరీస్‌ కు భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, మనీశ్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కు భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, బుమ్రా, మనీశ్‌ పాండే, సంజూ శాంసన్‌.