
ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే యమ క్రేజ్..లక్షల్లో జీతాలు, కార్పొరేట్ సౌకర్యాలు.. సాఫ్ట్ వేర్ అయితే చాలు గవర్న్ మెంట్ ఉద్యోగం వచ్చినా వదిలి వెళ్లిన వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. టెక్ కంపెనీల లేఆఫ్ లతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో గుబులు పుడుతోంది. 2022, 23సంవత్సరాల్లో స్టార్టప్ కంపెనీలనుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. 2024లో కొంత తగ్గినప్పటికీ 2025 లో రెండోస్థానంలో భారత్లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
కంపెనీలునిర్వహణ, కొత్త టెక్నాలజీ,బిజినెస్‌లో మార్పులు వంటి కారణాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలతో సహా పేరు మోసిన కంపెనీలు కూడా ఈ లేఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆన్ లైన్ గేమింగ్ వంటి రంగాల్లో ఈ లేఫ్స్ లు ఎక్కువగా ఉన్నాయి. జనవరి 2025 నుంచి అక్టోబర్ 2025 మధ్య 4వేల200 కంటే ఎక్కువ తొలగింపులు జరిగాయి.
ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ ,నియంత్రణ చట్టం, 2025 తర్వాత ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), గేమ్‌స్క్రాఫ్ట్ ,ఇతర ప్రధాన కంపెనీలలో పెద్ద తొలగింపులకు దారితీసింది. MPL దాని భారతదేశ శ్రామిక శక్తిలో దాదాపు 60శాతం మందిని తొలగించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కూడా ఈ తొలగింపులకు భారీగా ఉన్నాయి.
2023తో పోలిస్తే తొలగింపులు తగ్గినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్టెక్ బూమ్ తర్వాత కంపెనీలు నిర్వహణ, లాభాలపై దృష్టి సారించడంతో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల తొలగింపులలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ఈ ఏడాది అంటే 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో జరిగిన మొత్తం తొలగింపులలో దాదాపు 5శాతం వాటా ఉంది.
►ALSO READ | ధంతేరాస్-దీపావళికి దుమ్ములేపిన అమ్మకాలు: మారుతి నుండి టాటా, హ్యుందాయ్ వరకు రికార్డు సేల్స్..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 84 శాతం మంది ఉద్యోగుల తొలగింపుకు గురయ్యారు. అక్టోబర్ 2025 వరకు అమెరికాలో 76వేల 907 మంది ఉద్యోగులు లేఆఫ్స్ బారిన పడ్డారు. భారత్4వేల582 మంది ఉద్యోగుల తొలగింపులతో రెండో స్థానంలో ఉంది. ఇది మొత్తం ఉద్యోగాలలో 5 శాతం. స్వీడన్ (3.3 శాతం), కెనడా (2.4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీ, ఇజ్రాయెల్ ,నెదర్లాండ్స్ వంటి ఇతర దేశాల్లో 1-2 శాతం వరకు తొలగింపులు జరిగాయి.
భారత్ లో ఉద్యోగుల తొలగింపులలో బెంగళూరు టెక్ కంపెనీలు మొదటిస్థానంలో ఉన్నాయి. 52 శాతానికిపై ఉద్యోగులను తొలగించాయి. ముంబై (13.5 శాతం), న్యూఢిల్లీ (12.5 శాతం), హైదరాబాద్ (11.7 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురుగ్రామ్ (7.5 శాతం) ,నోయిడా (2.3 శాతం) తొలగింపులతో స్టార్టప్‌లు ,డిజిటల్ సర్వీస్ కంపెనీలలో తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి.