ఇండియన్ వెల్స్ (అమెరికా): ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ యానిక్ సినర్, వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంక తొలిసారి విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో రెండో ర్యాంకర్ సినర్ (ఇటలీ) 7–-6 (7/6), 7–-6 (7/4) తేడాతో డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించి టైటిల్ నెగ్గాడు.
రెండో సెట్ టైబ్రేక్‌లో 0-4తో వెనుకంజలో ఉన్నప్పటికీ, వరుసగా ఏడు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మెద్వెదెవ్‌తో జరిగిన గత 10 మ్యాచ్‌ల్లో సినర్‌కు ఇది తొమ్మిదో విజయం.మరోవైపు విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో సబలెంక (బెలారస్) 3–-6, 6–-3, 7–-6 (6)తో ఎలెనా రిబకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. 2023, 2025లో రన్నరప్‌గా నిలిచిన సబలెంక ఎట్టకేలకు ఇక్కడ తన తొలి టైటిల్‌ను ముద్దాడింది.
