లాన్‌ బౌల్స్‌ ఉమెన్స్‌ ఫోర్స్‌లో భారత్కు స్వర్ణం

లాన్‌ బౌల్స్‌ ఉమెన్స్‌ ఫోర్స్‌లో భారత్కు స్వర్ణం

ఇండియా లాన్‌‌ బౌల్స్‌‌ టీమ్‌‌ రికార్డు సృష్టించింది. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో స్వర్ణ పతకం సాధించి బంగారు చరిత్ర లిఖించింది. విమెన్స్‌‌ ఫోర్స్‌‌ ఈవెంట్‌‌ఫైనల్లో  భారత జట్టు సౌతాఫ్రికాను 17-10 స్కోరు తేడాతో ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. . 92 ఏళ్ల కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో  మొట్టమొదటిసారిగా భారత లాన్ బౌల్స్ ఉమెన్స్ టీమ్.. పతకం సాధించడం విశేషం. ఫైనల్లో  లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన విమెన్స్‌‌ ఫోర్స్‌‌ ఈవెంట్‌‌ఫైనల్ హోరాహోరీగా జరిగింది. మొదటగా దక్షిణాఫ్రికా కాయిన్ టాస్ గెలిచి జాక్ సెట్ చేసింది. ఈ సమయంలో భారత్ టీమ్స్  మంచి ఆరంభానిచ్చింది. భారత్ ఒక పాయింట్‌తో ఓపెనింగ్ రౌండ్‌ను గెలిచింది. మూడో రౌండ్ తర్వాత స్కోరు 3-3తో సమమైంది. దీని తర్వాత  భారత్ ధీటుగా జవాబిచ్చింది.  7వ రౌండ్ తర్వాత 8-3 ఆధిక్యంలో నిలిచింది. 7వ రౌండ్ తర్వాత దక్షిణాఫ్రికా ఆధిక్యంలో కొనసాగింది. 11వ రౌండ్ వరకు సౌతాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్ పుంజుకోవడంతో..స్కోరు 10-10తో సమమైంది. ఆ తర్వాత భారత జట్టు జోరును కొనసాగించింది. చివరకు 17-10తో సౌతాఫ్రికాను ఓడించి..స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 

అంతకుముందు  సోమవారం  సెమీఫైనల్లో లవ్లీ చౌబే ), పింకి, నయన్మోయి సైకియా, రూపా రాణి టర్కీతో కూడిన భారత జట్టు 16–13 తేడాతో న్యూజిలాండ్‌ ను ఓడించి తొలిసారి ఫైనల్‌‌ చేరుకుంది.

మరోవైపు తాజా స్వర్ణంతో భారత్ ఖాతాలో నాలుగు బంగారు పతకాలు చేరాయి. వీటితో పాటు 3 సిల్వర్ మెడల్స్, 3 కాంస్యాలను..మొత్తంగా 10 పతకాలను భారత్ ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్లో సాధించింది.