
- ఈ దేశాలకు రూ.3 వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: భారత్ నుంచి తుర్కియే, అజర్‌బైజాన్‌లకు ట్రావెల్ బుకింగ్స్ పడిపోతున్నాయి. ఇప్పటికే చేసుకున్న బుకింగ్స్‌ను టూరిస్ట్‌లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తాజాగా నెలకొన్న భారత్, పాక్ ఉద్రిక్తతలలో తుర్కియే, అజర్‌బైజాన్ పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా నిలిచాయి. డ్రోన్లను పంపాయి. దీంతో ఈ దేశాలను బాయ్‌కాట్ చేయాలనే నినాదాలు ఇండియాలో పెరుగుతున్నాయి. మేక్ మై ట్రిప్ ప్రకారం, అజర్‌బైజాన్, తుర్కియేకి బుకింగ్స్ 60 శాతం తగ్గాయి.
కేవలం ఒక వారంలో క్యాన్సిలేషన్స్ 250 శాతం పెరిగాయి. ప్రజల సెంటిమెంట్‌ను సపోర్ట్ చేస్తూ, అజర్‌బైజాన్, తుర్కియేలకు అత్యవసరం కాకపోతే వెళ్లొద్దని ఈ కంపెనీ పేర్కొంది. ఈ రెండు దేశాలకు సంబంధించిన అన్ని ప్రమోషన్స్, ఆఫర్స్‌ను కూడా రద్దు చేసింది.
మరో పెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ తుర్కియేకి 22 శాతం, అజర్‌బైజాన్‌కు 30 శాతం టూరిస్టుల తగ్గుదలను రిపోర్ట్ చేసింది. టూరిస్టులు తగ్గడం వల్ల ఈ రెండు దేశాలకు రూ.3 వేల కోట్ల రెవెన్యూ లాస్ వస్తుందని అంచనా వేసింది. ఈజ్‌మైట్రిప్ భారతీయ ట్రావెలర్లను గ్రీస్, ఆర్మేనియా వంటి ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్‌ను ఎంచుకోమని సూచించింది.