ఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ

ఉక్రయిన్ లో చిక్కకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలి : అసదుద్దీన్ ఓవైసీ

బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతులో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్  నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారని తెలిపారు. 

అక్కడి నుండి స్థానిక ఏజెంట్ఎక్కువ జీతం వస్తుందని రష్యా దేశంలో సెక్యూరిటీ లేబర్ గా పని చేయాలని వారిని రష్యాకు పంపించారని తెలిపారు. అక్కడికి వెళ్లిన వారితో రష్యా ఆర్మీలో పని చేయించుకుంటున్నారని గత ఏడాది డిసెంబర్ 31న రష్యన్ ఆర్మీతో కలిసి ఉక్రెయిన్ దేశంలోకి వెళ్లిన అనంతరం వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంతో పాటు , కర్ణాటక , గుజరాత్ , యూపీ , జమ్మూకాశ్మీర్ ల నుండి 12 మంది ఉక్రెయిన్ చిక్కుకున్నారన్నారు. వారిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రిలతో మాట్లాడుతానని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.