దుబాయ్ జైలు నుంచి విడుదల.. 18 ఏళ్ల తరువాత సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు

దుబాయ్ జైలు నుంచి విడుదల..  18 ఏళ్ల తరువాత సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు

దాదాపు 18 ఏళ్ల తరువాత దుబాయ్​జైలు నుంచి విడుదలై తెలంగాణ వాసులు సొంతింటికి చేరుకున్నారు.   సుదీర్ఘకాలంజైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన  కార్మికులకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటికి చేరారు. అయితే నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ బహదూర్‌సింగ్‌ హత్య కేసులో ఐదుగురు సిరిసిల్ల వాసులకు 25 ఏళ్ల జైలుశిక్ష పడింది. 

ఇప్పటికే 18 ఏళ్ల జైలుశిక్ష అనుభవించారు. మరో ఏడేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చొరవతో  దుబాయ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్ష  లభించడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. 

వారికి  సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు. ఇవాళ ఇంటికి చేరడంతో  కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.  రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్,  రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు.