సంగారెడ్డిలో తొమ్మిదో తరగతి విద్యార్థి మిస్సింగ్

సంగారెడ్డిలో  తొమ్మిదో తరగతి విద్యార్థి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి కనిపించకుండా పోయాడు. బాలాజీ నగర్ కు చెందిన మనోహర్ (14) స్నేహితుడిని కలిసి వస్తానని వెళ్లిన మనోహర్ తిరిగి రాక పోవడంతో, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ కనిపించలేదు. 

 విద్యార్థి తండ్రి స్వర్ణం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అమీన్ పూర్ పోలీసులు. విద్యార్థిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.