వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌

రియో డి జనెరో:

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌ వాలారివన్‌‌‌‌‌‌‌‌.. ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌ 252.2 పాయింట్లు నెగ్గి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఎనిమిది మంది పోటీపడ్డ టైటిల్‌‌‌‌‌‌‌‌ఫైట్‌‌‌‌‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌ ఏ రౌండ్‌‌‌‌‌‌‌‌లోనూ 10.1 పాయింట్ల కంటే తక్కువగా స్కోరు చేయలేదు. మొత్తం 24 షాట్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటరే ఆధిపత్యం చూపెట్టింది. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఓషియాన్ ముల్లర్ 251.9 పాయింట్లతో సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలవగా, జాంగ్‌‌‌‌‌‌‌‌ జియాలె (చైనా) బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. ఇక క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో 630.5 పాయింట్లతో నిలిచిన ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌ ఎనిమిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించగా, ముల్లర్‌‌‌‌‌‌‌‌ 633.7 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. మెన్స్‌‌‌‌‌‌‌‌10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో సందీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ 628.2 పాయింట్లతో 14వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌–సందీప్‌‌‌‌‌‌‌‌ 0.5 పాయింట్ల తేడాతో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను మిస్సయ్యారు. ఫైనల్లో ఎలావెనిల్‌‌‌‌‌‌‌‌ 314.8, సందీప్‌‌‌‌‌‌‌‌ 314.3 పాయింట్లు నెగ్గారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఇండియా ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌తో సంయుక్తంగా మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నది.