కుర్రాళ్లకు సఫారీ సవాల్ ..డిసెంబర్ 10న సౌతాఫ్రికాతో ఇండియా తొలి టీ20

కుర్రాళ్లకు సఫారీ సవాల్ ..డిసెంబర్ 10న సౌతాఫ్రికాతో ఇండియా తొలి టీ20
  • రా. 7.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌

డర్బన్‌‌‌‌‌‌‌‌ : సీనియర్ల గైర్హాజరీలో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌.. కఠినమైన సౌతాఫ్రికా సవాల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి పోరు జరగనుంది. మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఉన్న నేపథ్యంలో కుర్రాళ్లందరూ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచే సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా గాయపడటం, స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం, స్టార్లు రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉంటారో లేదో తెలియని పరిస్థితుల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ పక్కాగా బరిలోకి దిగుతున్నారు.

అయితే మిగతా దేశాలతో పోలిస్తే సౌతాఫ్రికాలో పిచ్‌‌‌‌‌‌‌‌లు, వాతావరణం నుంచి ఎదురయ్యే కఠిన సవాళ్లను అధిగమించడం అంత ఈజీ కాదు. అయినా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌పై 4–1తో సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగుతున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మొత్తం 17 మందిలో తుది జట్టును ఎంపిక చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌కు కాస్త ఇబ్బందికరమే. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రుతురాజ్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరికే చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కొచ్చు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఖాయం.

కీపర్‌‌‌‌‌‌‌‌గా ఇషాన్‌‌‌‌‌‌‌‌ కంటే జితేశ్‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇషాన్‌‌‌‌‌‌‌‌ వన్డేల్లో కూడా ఆడాల్సి ఉంది. కాకపోతే జితేశ్‌‌‌‌‌‌‌‌ మంచి ఫినిషర్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌తో ఇతనికి మంచి అవగాహన  ఉండటం కలిసొచ్చే అంశం. పేసర్లుగా మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరికి చోటు ఖాయం. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా జడేజా, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ను తీసుకోవచ్చు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా కుల్దీప్‌‌‌‌‌‌‌‌, బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ మధ్య పోటీ ఉంది.

సఫారీలూ కొత్త ప్లేయర్లతోనే

సౌతాఫ్రికా కూడా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో పలు ప్రయోగాలు చేయబోతున్నది. సీనియర్లు లేకుండా మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలో కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారు. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌కు తోడుగా బ్రీట్జ్‌‌‌‌‌‌‌‌కేను ఆడించనున్నారు. కీపర్లుగా ట్రిస్టాన్‌‌‌‌‌‌‌‌ స్టబ్స్‌‌‌‌‌‌‌‌, హెన్రిచ్‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌‌‌‌‌లో ఒకరికే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు. టీమ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మంది ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు ఉండటం సఫారీలకు అతిపెద్ద బలం. డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఫెలుక్వాయోలో ఇద్దరు మాత్రమే ఆడనున్నారు. లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌ అరంగేట్రంచేసే అవకాశం ఉంది. స్పిన్నర్లుగా కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌, షంసీ బరిలోకి దిగొచ్చు.