ద్రవ్య లోటు@రూ. 9.06 లక్షల కోట్లు

ద్రవ్య లోటు@రూ. 9.06 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్య లోటు రూ. 9.06 లక్షల కోట్లు లేదా పూర్తి సంవత్సర బడ్జెట్ అంచనాలో 50.7 శాతానికి చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ప్రకటించింది. 2023–-24 ఏప్రిల్– -అక్టోబర్ కాలంలో ద్రవ్య లోటు.. వ్యయం, రాబడి మధ్య వ్యత్యాసం -- రూ.9,06,584 కోట్లు ఉంది. గత ఏడాది ఇదే కాలంలో లోటు 2022–-23 బడ్జెట్ అంచనాలలో 58.9 శాతంగా ఉంది. 

2023–-24లో ప్రభుత్వ ఆర్థిక లోటును రూ.17.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది జీడీపీలో 5.9 శాతం. ఈ ఏడాది నవంబర్ వరకు కేంద్రం రూ. 14.35 లక్షల కోట్ల పన్ను రాబడి (నికర), రూ. 2.84 లక్షల కోట్ల పన్నుయేతర ఆదాయం,  రూ. 25,463 కోట్ల  నాన్​ డెట్​ క్యాపిటల్ రిసీట్స్​ రూ. 17.4 లక్షల కోట్లు (2023--–24 బడ్జెట్​ అంచనాల మొత్తం రశీదులలో 64.3 శాతం ) పొందింది.   

సీజీఏ డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్–-నవంబర్​లో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం రూ. 26.52 లక్షల కోట్లు (సంబంధిత బడ్జెట్ అంచనాల్లో 58.9 శాతం) ఉంది. మొత్తం వ్యయంలో రూ.20.66 లక్షల కోట్లు రెవెన్యూ ఖాతాలో, రూ.5.85 లక్షల కోట్లు మూలధన ఖాతాలో ఉన్నాయి.  2025–-26 నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.5 శాతానికి దిగువకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.