
హైదరాబాద్:భారత ప్రతిష్టను ప్రధాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ను ముట్టడించారు ఏఐవైఎఫ్ నేతలు.హిమాయత్‌నగర్ ఏఐటీయూసీ భవన నుంచి వినూత్న రీతిలో ట్రంప్, మోదీ మాస్క్ లతో అమెరికా కాన్సులేట్ వరరు ర్యాలీ నిర్వహించారు.
భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుర్మార్గపు చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్య వాదం నశించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో కాన్సులేట్ ఆవరణలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐవైఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు నారాయణగూడ పోలీసులు.