Women's ODI World Cup 2025: సొంతగడ్డపై చిగురిస్తున్న ఆశలు.. వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే!

Women's ODI World Cup 2025: సొంతగడ్డపై చిగురిస్తున్న ఆశలు.. వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే!

47 ఏళ్ళ మహిళల వన్డే చరిత్రలో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017  వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌గా ఇండియా ఫేవరెట్‌‌‌‌ అయితే.. డిఫెండింగ్ చాంప్ హోదాలో ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌‌‌‌గా ఉంది. 

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనుంది. ఇండియాలోని ముంబై, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‎లో నిర్వాహించాల్సి వచ్చింది. 

మంగళవారం (సెప్టెంబర్ 30) ఆతిథ్య ఇండియా శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది. గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. అందరూ ఎదురు చూసే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబో వేదికగా అక్టోబర్ 5 న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‎కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది.

రౌండ్-రాబిన్ దశ అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. రౌండ్-రాబిన్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్ ఆడతాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్.

2025 మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఇండియా షెడ్యూల్: 

సెప్టెంబర్ 30---శ్రీలంక--బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతి

అక్టోబర్ 5--పాకిస్తాన్--ఆర్.ప్రేమదాస స్టేడియం, కొలంబో

అక్టోబర్ 9--దక్షిణాఫ్రికా--డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం

అక్టోబర్ 12--ఆస్ట్రేలియా--డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం

అక్టోబర్ 19--ఇంగ్లాండ్--హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్

అక్టోబర్ 23--న్యూజిలాండ్--డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబై

అక్టోబర్ 26--బంగ్లాదేశ్--డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబై


2025 మహిళల వన్డే వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్:
 
మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 1—ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 2—బంగ్లాదేశ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 3 — ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా — బెంగళూరు — మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 4—ఆస్ట్రేలియా vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 5—భారతదేశం vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 6—న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 7—ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్—గువహతి—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 8—ఆస్ట్రేలియా vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 9 — భారత్ vs దక్షిణాఫ్రికా — వైజాగ్ — మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 10—న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 11 — ఇంగ్లాండ్ vs శ్రీలంక — గౌహతి — మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 12—భారత్ vs ఆస్ట్రేలియా—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 13—దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 14—న్యూజిలాండ్ vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 15—ఇంగ్లాండ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 16—ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్—వైజాగ్—మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 17—దక్షిణాఫ్రికా vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 18—న్యూజిలాండ్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 19—భారతదేశం vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
సోమవారం, అక్టోబర్ 20—శ్రీలంక vs బంగ్లాదేశ్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
మంగళవారం, అక్టోబర్ 21—దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 22—ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 23 — భారత్ vs న్యూజిలాండ్ — గౌహతి — మధ్యాహ్నం 3 గంటలకు
శుక్రవారం, అక్టోబర్ 24—పాకిస్తాన్ vs శ్రీలంక—కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
శనివారం, అక్టోబర్ 25—ఆస్ట్రేలియా v శ్రీలంక—ఇండోర్—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, అక్టోబర్ 26—ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్—గువహతి—ఉదయం 11
ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
బుధవారం, అక్టోబర్ 29—సెమీఫైనల్ 1—గువహతి/కొలంబో—మధ్యాహ్నం 3 గంటలకు
గురువారం, అక్టోబర్ 30—సెమీఫైనల్ 2—బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు
ఆదివారం, 2 నవంబర్—ఫైనల్—కొలంబో/బెంగళూరు—మధ్యాహ్నం 3 గంటలకు