ఇండియాలో సోలార్ సెక్టార్ దూకుడు.. వరల్డ్ నంబర్2 మార్కెట్గా అవతరణ

ఇండియాలో సోలార్ సెక్టార్ దూకుడు.. వరల్డ్ నంబర్2  మార్కెట్గా అవతరణ
  • రూబిక్స్ డేటా సైన్సెస్ రిపోర్ట్​

న్యూఢిల్లీ: మనదేశం ఈ ఏడాదే ప్రపంచంలో రెండో అతిపెద్ద సౌరశక్తి మార్కెట్‌‌‌‌‌‌‌‌గా అవతరించనుందని వెల్లడయింది. ఈ ఏడాది మార్చి నాటికే సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరింది. రూబిక్స్ డేటా సైన్సెస్ నివేదిక ప్రకారం, 2030 నాటికి 280 నుంచి 300 గిగావాట్ల సామర్థ్యం చేరుకునే అవకాశం ఉంది.

అమెరికా విధిస్తున్న 200 శాతం సుంకాల వల్ల సోలార్​ మాడ్యూల్ ఎగుమతులు తగ్గడం మాత్రం సమస్యగా మారింది. ఎగుమతులు  రూ. 9,300 కోట్లకు పరిమితమయ్యాయి. చైనా నుంచి పీవీ సెల్స్ దిగుమతులు 65 శాతానికి చేరాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల వల్ల దిగుమతులు తగ్గుతున్నాయి.

మరోవైపు దేశీయ తయారీ పెరుగుతోంది. అదానీ గ్రూప్, టాటా పవర్ , వారీ ఎనర్జీస్ వంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గత ఏడాది ఈ రంగంలో 2.37 బిలియన్ డాలర్ల (రూ. 19,700 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్​ వెల్లడించింది.