
- గెలిచి.. నిలిచి టీంఇండియా
- దంచికొట్టిన సూర్యకుమార్, శ్రేయస్
- మెరిసిన శార్దూల్, పాండ్యా
అహ్మదాబాద్: లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఫోర్త్ టీ20 మ్యాచ్లో ఇండియా పైచేయి సాధించింది. బౌలర్లందరూ రాణించి టార్గెట్ను కాపాడుకోవడంతో... గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 8 రన్స్ తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 రన్స్ చేసింది. సూర్య, శ్రేయస్తో పాటు రిషబ్ పంత్ (23 బాల్స్లో 4 ఫోర్లతో 30) రాణించాడు. ఆర్చర్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 రన్స్కే పరిమితమైంది. జేసన్ రాయ్ (27 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 40) ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆఖరిదైన ఐదో టీ20 శనివారం ఇదే వేదికపై జరుగుతుంది.
సూర్య.. సూపర్బ్
ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ను సిక్సర్గా మలిచి జోరు చూపెట్టిన రోహిత్ (12).. ఆర్చర్ వేసిన స్లో బాల్ను డిఫెన్స్ చేయబోయి బౌలర్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలిసారి బ్యాటింగ్కు వచ్చిన సూర్య కుమార్ కూడా తన ఫస్ట్ బాల్నే భారీ సిక్సర్గా మల్చడంతో పాటు ఓవర్కు ఓ ఫోర్తో ఆకట్టుకున్నాడు. రెండోఎండ్లో రాహుల్ (14) మెల్లగా ఆడటంతో పవర్ప్లేలో ఇండియా 45/1 స్కోరు చేసింది. రషీద్ వేసిన ఏడో ఓవర్లో సూర్య వరుసగా 4, 6తో రెచ్చిపోయాడు. కానీ, తర్వాత ఏడు బాల్స్ తేడాలో రాహుల్, కోహ్లీ (1) పెవిలియన్కు చేరారు. స్టోక్స్ బాల్ను మిడాఫ్లోకి షాట్ కొట్టిన రాహుల్.. ఆర్చర్కు చేతికి చిక్కితే, రషీద్ గూగ్లీని ఫ్రంట్ఫుట్పై ఆడే క్రమంలో విరాట్ స్టంపౌటయ్యాడు. దీంతో 70/3తో హోమ్ టీమ్ కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన రిషబ్.. సూర్యకుమార్కు చక్కని సహకారం అందించాడు. 12వ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు కొట్టి 28 బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. 14వ ఓవర్ ఫస్ట్ బాల్ను స్టాండ్స్లోకి పంపిన సూర్యకుమార్... తర్వాతి బాల్కే థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఔటవడంతో ఫోర్త్ వికెట్కు 28 బాల్స్లో 40 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది.
అయ్యర్, పంత్ ఫటాఫట్
పంత్తో జతకలిసిన శ్రేయస్ క్లాసిక్ షాట్స్తో చెలరేగిపోయాడు. స్టార్టింగ్ నాలుగు బాల్స్లోనే రెండు ఫోర్లు కొట్టి టచ్లోకి వచ్చాడు. పంత్ కూడా అండగా నిలవడంతో స్కోరు బోర్డులో వేగం పెరిగింది. ఫలితంగా ఫస్ట్ టెన్లో 75/3తో ఉన్న స్కోరు 15 ఓవర్లలో 128/4కు చేరింది. 16వ ఓవర్లో అయ్యర్ మరో రెండు ఫోర్లతో రెచ్చిపోయినా, తర్వాతి ఓవర్లో పంత్ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. దీంతో ఐదో వికెట్కు 34 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. కొత్తగా వచ్చిన పాండ్యా (11).. జోర్డాన్ (18వ ఓవర్) ఫస్ట్ బాల్కు సిక్సర్ కొడితే, శ్రేయస్4, 6 రాబట్టాడు. ఈ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. ఇన్నింగ్స్లో జోరు పెంచే ప్రయత్నంలో ఈ ఇద్దరు మూడు బాల్స్ తేడాలో ఔటయ్యారు. రెండు బాల్స్ తర్వాత సుందర్ (4) కూడా వెనుదిరిగినా, శార్దూల్ (10 నాటౌట్) బౌండ్రీతో ఇండియా భారీ టార్గెట్ను నిర్దేశించింది.
స్టోక్స్ మెరుపులు..గెలిపించిన శార్దూల్
టార్గెట్ ఛేజింగ్లో ఇంగ్లండ్కు స్టార్టింగ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సిక్సర్తో జోరు చూపెట్టిన బట్లర్ (9)ను మూడో ఓవర్లోనే భువీ వెనక్కి పంపినా.. రాయ్ నిలకడగా ఆడాడు. ఫస్ట్ నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అతను.. సుందర్ వేసిన ఆరో ఓవర్లో 4, 6, 4తో 17 రన్స్ పిండుకున్నాడు. దీంతో పవర్ప్లేలో ఇంగ్లిష్ టీమ్ 48/1 స్కోరు చేసింది. వన్డౌన్లో మలన్ (14) సిక్సర్తో జోరు పెంచినా.. ఎనిమిదో ఓవర్లోనే చహర్కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఫలితంగా రెండో వికెట్కు 45 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. తర్వాతి ఓవర్లో పాండ్యా వేసిన షార్ట్ పిచ్ బౌన్సర్ను ఫుల్ చేసిన రాయ్.. మిడ్ వికెట్లో సూర్యకు చిక్కాడు. ఫస్ట్ టెన్లో విజిటింగ్ టీమ్ స్కోరు 71/3గా మారింది. ఈ దశలో సుందర్ను టార్గెట్ చేసి స్టోక్స్, బెయిర్స్టో (25) వేగం పెంచారు. 12వ ఓవర్లో 6, 4తో 12 రన్స్ రాగా, తర్వాతి ఓవర్లోనూ ఓ సిక్స్తో 9 రన్స్ రాబట్టారు. 14వ ఓవర్ (సుందర్) లో బెయిర్స్టో వరుసగా 4, 6, 4తో 18 రన్స్ పిండుకున్నాడు. అయితే చహర్ వేసిన 15వ ఓవర్లో స్టోక్స్ 4, 6 కొట్టినా, బెయిర్స్టో ఔట్కావడంతో ఇండియాకు బ్రేక్ లభించింది. నాలుగో వికెట్కు 65 రన్స్పార్ట్నర్షిప్ ముగిసింది. కోహ్లీ డగౌట్కు రావడంతో కెప్టెన్సీ చేసిన రోహిత్ 17వ ఓవర్లో పన్నిన స్ట్రాటజీకి స్టోక్స్, మోర్గాన్ (4) చిక్కారు. శార్దూల్ ఫస్ట్ వేసిన స్లో బాల్ను షాట్కు ట్రై చేసిన స్టోక్స్ లాంగాఫ్లో చిక్కాడు. తర్వాత ఆఫ్ కట్టర్కు మోర్గాన్ పాయింట్లో సుందర్కు క్యాచ్ ఇచ్చాడు. వరుస బాల్స్లో ఈ ఇద్దరు ఔట్కావడంతో మ్యాచ్ ఇండియా వైపు మొగ్గింది. ఇక లాస్ట్ 18 బాల్స్లో 39 రన్స్ చేయాల్సిన దశలో కరన్ (3), జోర్డాన్ (12)ను పాండ్యా కట్టడి చేశాడు. 18వ ఓవర్ లాస్ట్ బాల్కు కరన్ను ఔట్ చేయడంతో విక్టరీ ఈక్వేషన్ 12 బాల్స్లో 33గా మారింది. 19వ ఓవర్లో 10 రన్సే వచ్చినా.. శార్దూల్ లాస్ట్ ఓవర్లో ఆర్చర్ (18 నాటౌట్) 4, 6 కొట్టి టెన్షన్కు తీసుకొచ్చాడు. లాస్ట్ త్రీ బాల్స్లో 12 చేయాల్సిన టైమ్లో జోర్డాన్ వికెట్ తీసి మ్యాచ్ గెలిపించాడు.