మూడో క్వార్టర్ జీడీపీ గ్రోత్​ @ 7.6 %

మూడో క్వార్టర్ జీడీపీ గ్రోత్​ @  7.6 %

న్యూఢిల్లీ : సెప్టెంబర్​2023 క్వార్టర్లో  మన జీడీపీ 7.6 శాతం గ్రోత్​ సాధించింది. మాన్యుఫాక్చరింగ్​, మైనింగ్​, సర్వీస్​ సెక్టార్లు దూసుకెళ్లడం వల్లే ఈ గ్రోత్​ సాధ్యపడినట్లు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. 2022 జులై–సెప్టెంబర్​ క్వార్టర్లో  ఎకానమీ గ్రోత్​ 6.2 శాతమే. నేషనల్​ స్టాటిస్టికల్ ఆఫీస్​ రిలీజ్​ చేసిన డేటా ప్రకారం అగ్రికల్చర్​ సెక్టార్​ జీవీఏ (గ్రాస్​ వాల్యూ యాడెడ్​) గ్రోత్  తాజా సెప్టెంబర్​ క్వార్టర్లో 1.2 శాతం తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో అగ్రికల్చర్​ సెక్టార్​ జీవీఏ  గ్రోత్​ 2.5 శాతం వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో వేగంగా ఎదుగుతున్న ఎకానమీ స్టేటస్​ను ఇండియా నిలబెట్టుకుంది. ఎందుకంటే, జులై–సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో గ్రోత్​ విషయంలో మనతో పోటీపడుతున్న చైనా 4.9 శాతం గ్రోత్​ను మాత్రమే రికార్డు చేసింది. ఫైనాన్షియల్​, రియల్​ ఎస్టేట్​, ప్రొఫెషనల్​ సర్వీసెస్​ సెక్టార్ల జీవీఏ తాజా క్వార్టర్లో 6 శాతం గ్రోత్​ నమోదు చేశాయి.  కానీ, అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో వీటి గ్రోత్​ 7.1 శాతం. మైనింగ్​, క్వారీయింగ్​ అవుట్​పుట్​ (జీవీఏ) రెండో క్వార్టర్లో  ఏకంగా 10 శాతం పెరగడం విశేషం. ఇక కన్​స్ట్రక్షన్​ సెక్టార్​ 13.3 శాతం గ్రోత్​ సాధించినట్లు డేటా చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.4 శాతం గ్రోత్‌‌‌‌ నమోదు చేస్తుందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.