దట్టమైన పొగమంచు కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. రాయ్ పూర్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని భువనేశ్వర్‌కు మళ్లించగా.. మరో ఎయిరిండియా విమానాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఫైట్‌ను మధ్యాహ్నం 12.37 నిమిషాలకు భువనేశ్వర్‌కు మళ్లించారు.
ఛండీఘడ్, రాంచీ, రాయ్ పూర్, అగర్తలాల్లో వాతావరణ పరిస్థితులు విమాన సర్వీసులపై ప్రభావం చూపాయి. విమాన కార్యకాలపాలపై ప్రయాణికులు ముందుగానే సమాచారం తెలుసుకుని రావాలని అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయం నుంచి ఉదయం 9.50 గంటలకు బయలుదేరిన ఎయిరిండియా విమానం.. 11.30 గంటలకు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో నాగ్ పూర్‌కు మళ్లించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.