హైదరాబాద్ దంపతులకు ఇండిగో రూ.10 వేల పరిహారం...ఎందుకంటే.?

హైదరాబాద్ దంపతులకు ఇండిగో రూ.10 వేల పరిహారం...ఎందుకంటే.?

ఇండిగోలో ప్రయాణించిన  హైదరాబాద్ దంపతులకు రూ.10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం. 45 రోజుల్లో పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.

అసలేం జరిగిందంటే.? 2021లో  ఇద్దరు దంపతులు  హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్ లైన్స్  విమానంలో ప్రయాణించారు. విమానంలో అపరిశుభ్రత కారణంగా తన భర్త వాంతులు చేసుకున్నారని జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. కోచ్‌లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్‌కిన్‌లతో నింపారని ఆరోపించారు. అయితే ఆరోగ్య సమస్యలను ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్  ప్రయాణికులు ఎక్కే ముందు ఇండిగో పరిశుభ్రత పాటించాలని ఆదేశించింది. జులై 1 నుంచి 45 రోజుల్లోగా పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.

గతంలో కూడా ఇండిగో  తన ఫ్లైట్ రద్దు విషయం తెలియజేయనందుకు హైదరాబాద్ లో ఓ వ్యక్తికి రూ.,30వేల పరిహారం చెల్లించాలనిఎయిర్ లైన్స్ ను  ఆదేశించింది. గడువు ముగిస్తే 12 శాతం వడ్డీతో చెల్లించాలని చెప్పింది.