హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఏమైందో ఏమో ..ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాక అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది.
ఇండిగో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి రాజేంద్రనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అక్టోబర్ 27న తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఇండిగో క్యాప్టెన్, మరో ఫ్రెండ్ తో కలిసి పార్టీ చేసుకున్నాక తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది యువతి.
సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతురాలిని జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తాగా గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. జాహ్నవి కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.దీంతో వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
