ఇండిగో ఫ్లైట్ల పరేషాన్.. దేశవ్యాప్తంగా 12వందల ఫ్లైట్స్ రద్దు..కారణమేంటంటే..

ఇండిగో ఫ్లైట్ల పరేషాన్.. దేశవ్యాప్తంగా 12వందల ఫ్లైట్స్ రద్దు..కారణమేంటంటే..

ఇండిగో ఫ్లైట్ల పరేషాన్.. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో గందరగోళం.. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టులలో టెక్నికల్ సమస్యలతో దాదాపు 2వేల ఫ్లైట్స్ నిలిచిపోయాయి. విదేశాలకు, ఎమర్జెన్సీ పై వెళ్తున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. శబరి మలకు వెళ్లే   అయ్యప్ప భక్తులకు ఈ తిప్పలు తప్పలేదు. ఏం జరుగుతుందో సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఎయిర్ లైన్స్ సిబ్బంది నెలకొంది. 

ఇండిగో విమానాలు ఆగిపోయవడంతో అనేక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితుల్లో ఇండిగో సంస్థ  క్లారిటీ ఇచ్చింది. టెక్నికల్, మెయింటెన్స్ సమస్యలు, ఎయిర్ పోర్టులతో రద్దీ కారణంగా రెండు రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది.. ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసులను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నాం.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్ చేస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. దాదాపు 1232 ఫ్లైట్స్  రద్దయ్యాయి.  సిబ్బంది  కొరతతో 755 విమానాలు, ఎయిర్ స్పేస్ పరిమితులతో 258 విమానాలు , ATC సిస్టం వైఫల్యంతో 92 విమానాలు రద్దు చేశామని  ప్రకటించింది ఇండిగో సంస్థ. కొత్త FDTL నిబంధనలతో తీవ్రమైన పైలట్ల కొరత ఏర్పడింది. విమానాల రద్దు, ఆలస్యంపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన ఇండిగో యాజమాన్యం.. 48 గంటల్లో పరిస్థితిని సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.  

విమానాల రద్దుపై ఇండిగో సంస్థను డీజీసీఏ వివరణ కోరింది. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబైలతోపాటు పలు విమానాశ్రయాల్లో మంగళ, బుధవారాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావటం, ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఈ క్రమంలో విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. 

►ALSO READ | హైదరాబాద్‌కు వస్తోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్‎లో 180 మంది ప్రయాణికులు..