ముంబై: ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎల్బర్స్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వల్ల ఇబ్బంది పడిన లక్షలాది మంది ప్రయాణికులకు పూర్తి రిఫండ్ చెల్లిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
‘‘మేం మిమ్మల్ని నిరాశపరిచాం. భారీ ఆపరేషనల్ అంతరాయం వల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. వేలాదిమంది ప్రయాణం చేయలేకపోయారు.. అందుకు మేం చింతిస్తున్నాం” అని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో చూపిస్తున్న విమానాలన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని తెలిపారు. యుద్ధప్రాతిపదికన సేవలను పునరుద్ధరించామని వెల్లడించారు.

