మహాప్రస్థానంలో ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు

మహాప్రస్థానంలో ముగిసిన ఇందిరాదేవి అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల్లో ఘట్టమనేని కృష్ణ కుటుంబసభ్యులు, పలువురు సినీ తారలు పాల్గొన్నారు. ఇందిరాదేవి ఇవాళ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శన కోసం ఇందిరాదేవి పార్థివదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచారు. 

ఇందిరాదేవి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరో వెంకటేశ్, డైరెక్టర్లు త్రివిక్రం, కొరటాల శివ, నిర్మాత అశ్వినీదత్..ఇతర ప్రముఖులు ఆమె పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కృష్ణ–ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం, రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కాగా.. ఇటీవలే మహేశ్ సోదరుడు రమేశ్ బాబు చనిపోయారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించారు.