Telangana Budget 2024 : మహిళల అభివృద్ధికి ఇందిరా క్రాంతి పథం

Telangana Budget 2024 : మహిళల అభివృద్ధికి ఇందిరా క్రాంతి పథం

ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందుకు మహాలక్ష్మి స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పింది.

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తున్నామని, మహాలక్ష్మి స్కీమ్‌‌లోని మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని పేర్కొంది. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న 35,781 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడుతామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.