కోనరావుపేట,వెలుగు: పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరుతుందని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గోవిందరావుపేట గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుండడంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అద్యక్షుడు ఫిరోజ్ పాషా, ఆయా గ్రామాల సర్పంచులు, లీడర్లు పాల్గొన్నారు.
