12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..షియర్ వాల్ టెక్నాలజీతో పూర్తి

12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..షియర్ వాల్ టెక్నాలజీతో పూర్తి

హైదరాబాద్, వెలుగు: అసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కేవలం12 రోజుల వ్యవధిలోనే ఇందిరమ్మ ఇంటిని షియర్ వాల్ టెక్నాలజీతో పూర్తి చేశారు. ఈ నెల 1న సీఎం రేవంత్ రెడ్డి గృహ ప్రవేశాలు చేసిన అసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కేవలం12 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. గృహ ప్రవేశాల కోసం ఈ నెల 1న సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామంలో పర్యటించారు. అదే రోజున ఆ ఇంటిని సీఎం, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

ఆ రోజుకు షెట్టరింగ్ పనులు పనులు పూర్తయి కాంక్రీట్ పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కాంక్రీట్ పోయగా, గురువారం సాయంత్రం డీషెట్టరింగ్ చేశారు. దీంతో దాదాపు ఇంటికి సంబంధించిన సివిల్ పనులన్ని పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో ఫినిషింగ్ పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేయనున్నారు.