పర్వతగిరి, వెలుగు: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి, సోమారం గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ఆయన పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఆయా ఇండ్ల లబ్ధిదారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
