హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారంలో మంగళవారం ఇందిరమ్మ టవర్లకు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కుత్బుల్లాపూర్ లోని కైసర్‌నగర్ వద్ద, ఆక్సిజన్ హోమ్స్‌కు ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తున్నారు.
లబ్ధిదారులకు ఫ్లాట్ నంబర్ల కేటాయింపునకు లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహిస్తారని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ సోమవారం పేర్కొన్నారు. లాటరీ లో ఫ్లాట్ దక్కి మొదటి వాయిదా కింద రూ.లక్ష చెల్లించిన అలాటీలకు, మంత్రి చేతుల మీదుగా బ్యాంకు ఎన్‌ఓసీలు డ్రా అనంతర అలాట్‌మెంట్ లెటర్లు అందజేస్తారన్నారు. అలాటీలందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని గౌతమ్ సూచించారు.
