కాగజ్ నగర్, వెలుగు: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఇందిరమ్మ చీరలు మండలాలకు చేరుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆసిఫాబాద్జిల్లా కౌటాలలోని ఐకేపీ ఆఫీస్ కు దాదాపు పదివేల చీరలు చేరుకున్నాయి. కౌటాలతో పాటు చింతలమానేపల్లి, సిర్పూర్(టి), బెజ్జూర్, పెంచికల్ పేట్ మండలాలకు వీటిని సరఫరా చేయనున్నట్లు ఏపీఎం వినేశ్ తెలిపారు..
