పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
  •    సిరిసిల్ల జిల్లాలో 2,720 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సామూహిక ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం రాజన్నసిరిసిల్ల జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి. రుద్రంగి, బోయినపల్లి, సిరిసిల్లలో ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ గరిమా అగ్రవాల్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,720 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు

.గోదావరిఖని/సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. 

నిజామాబాద్: జిల్లాలో సోమవారం సాయంత్రం 3,304 ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు జరిగాయి. బోధన్​ మండలం, నవీపేట, ఎడపల్లి, వర్ని, డొంకేశ్వర్​, నిజామాబాద్​ అర్బన్​లోని 8 డివిజన్​లో లబ్దిదారుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా గృహ ప్రవేశాలు చేశారు. మోపాల్​ మండలం కులాస్​పూర్​ గృహ ప్రవేశాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డొంకేశ్వర్​ మండలం అన్నారంలో జరిగిన గృహ ప్రవేశాల్లో ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్​​రెడ్డి పాల్గొన్నారు.

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో సోమవారం  ఇందిరమ్మ ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించారు.     కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్​ ఎస్సీ కాలనీలో  నిర్మాణాలు కంప్లీట్​ అయిన ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ప్రారంభించారు.  సదాశివనగర్​ మండల కేంద్రంలో  ఇందిరమ్మ ఇండ్లను  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు ప్రారంభించారు.