ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో భారత్ చారిత్రక గెలుపు

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో భారత్ చారిత్రక గెలుపు
  • 16–0తో ఇండోనేసియా చిత్తు
  • టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్‌‌

జకర్తా: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో నాకౌట్‌‌‌‌‌‌‌‌కు చేరాలంటే భారీ తేడాతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇండియా జూలు విదిల్చింది. పూల్‌‌‌‌‌‌‌‌–ఎలో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 16–0తో ఇండోనేసియాపై అద్భుత విజయం సాధించింది. దీంతో సూపర్‌‌‌‌‌‌‌‌–4కు క్వాలిఫై కావడంతో పాటు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ (2023) ఆశలపై నీళ్లు చల్లింది. ఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో సమంగా ఇండియా నాలుగు పాయింట్లే సాధించినా.. ఒక గోల్‌‌‌‌‌‌‌‌ డిఫరెన్స్‌‌‌‌‌‌‌‌తో నాకౌట్‌‌‌‌‌‌‌‌కు చేరింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ 2–3తో జపాన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడటం కూడా ఇండియాకు కలిసొచ్చింది. 
తాజా ఓటమితో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్‌‌‌‌‌‌‌‌.. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌కూ అర్హత సాధించలేకపోయింది.   టాప్‌‌‌‌‌‌‌‌–3 టీమ్స్‌‌‌‌‌‌‌‌ (జపాన్‌‌‌‌‌‌‌‌, కొరియా, మలేసియా) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో ఇండియాకు అర్హత దక్కింది. ఇండియా తరఫున డిప్సన్‌‌‌‌‌‌‌‌ టిర్కే (5 గోల్స్‌‌‌‌‌‌‌‌), సుదేవ్‌‌‌‌‌‌‌‌ బెలిమగ (3 గోల్స్‌‌‌‌‌‌‌‌), ఎస్‌‌‌‌‌‌‌‌వీ సునీల్‌‌‌‌‌‌‌‌ (2), పవన్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌బహర్‌‌‌‌‌‌‌‌ (2), కార్తీ సెల్వమ్‌‌‌‌‌‌‌‌ (2), ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (1), నీలమ్‌‌‌‌‌‌‌‌ సంజీప్‌‌‌‌‌‌‌‌ (1) గోల్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. నాకౌట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలంటే కనీసం 15–0 స్కోరుతో గెలవాల్సిన పరిస్థితుల్లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు గోల్స్‌‌‌‌‌‌‌‌ వర్షం కురిపించారు. ఒక్క ఫైనల్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనే ఆరు గోల్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగిపోయారు. ఇక ఆఖరి నిమిషంలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను టిర్కే గోల్స్‌‌‌‌‌‌‌‌గా మలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 

 

ఇవి కూడా చదవండి

ఇవాళ బెంగళూరు - రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో హ్యుందాయ్‌‌‌‌ 1400 కోట్ల పెట్టుబడి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు