మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని సరాఫా మార్కెట్‌లో (Sarafa Market) బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ షాప్ ఓనర్ని అందరు చూస్తుండనే గన్ తో కాల్చివేస్తామని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ షాప్ ఓనర్ కౌంటర్ వద్దకు వచ్చి గొడవపడ్డారు. వారిలో ఒకతను కోపంతో రెచ్చిపోయి గన్ తీసి, దుకాణదారుడిపైకి గురిపెట్టాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదృష్టవశాత్తూ గన్ పేలలేదు. కానీ ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్ని సెకన్లలోనే ఇదంతా జరిగిన తర్వాత వారు బైక్‌పై అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంఘటన భయాందోళనలు పుట్టిస్తున్న ఆరోన్ పోలీసులు ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పంకజ్ కుష్వాహా కూడా ఈ కేసుకు సంబంధించి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన మార్కెట్ వ్యాపారులలో, స్థానిక ప్రజలలో భయాన్ని రేపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
