- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆయన కొడుకు, మరికొందరిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన కామారెడ్డి
- మున్సిపల్ మాజీ చైర్పర్సన్
కామారెడ్డి, వెలుగు: సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అతని కొడుకు ఇలియాస్, మరి కొందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రఖర్రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీ రాజేశ్‌చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షబ్బీర్ అలీ ఎన్ని రోజులు ఆరాచకాలు చేస్తారని ప్రశ్నించారు.
తనపై సోషల్ మీడియాలో అభ్యంతకరంగా ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్నారు. పని చేయరు, చేసే వాళ్లను చేయకుండా టార్గెట్ చేస్తారని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి ఏం సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘మీ కుటుంబ సభ్యులకు ఏమి సలహాలు ఇస్తున్నారు? ఆడ బిడ్డలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయమని సలహాలు ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు. తాను ఎదగడం ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీతో పాటు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. షబ్బీర్ అలీ, అతని కొడుకు ఇలియాస్, అన్న కొడుకు షేర్ ముక్తార్, పర్వేజ్‌పై ఫిర్యాదు చేశారు.
