నేను శాంతి దూతను.. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను.. ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను. ప్రపంచ శాంతి కోసం నా లాగా కృషి చేస్తున్నవాళ్లెవరూ లేరు.. అందుకే నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి. నేనే సరైన అర్హుడను.. ఇవి నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ చేస్తూ వచ్చిన వ్యాఖ్యలు. శాంతి పురస్కారం కోసం నోబెల్ కమిటీపై ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రంగా ప్రయత్నించాడు ట్రంప్ . కానీఆ అవార్డు ట్రంప్ ను వరించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
నోబెల్ శాంతి ప్రైజ్ కోసం పగలూ రాత్రి కలలు కంటూ వచ్చిన ట్రంప్ కు ఆ అత్యున్న పురస్కారం అందలేదు. అయితేనేం.. మరో శాంతి పురస్కారాన్ని దక్కించుకున్నాడు. నోబెల్ రాకపోతేనేం.. ఏదో ఒక బహుమతి వచ్చిందిగా అనుకునేలా.. ఫిఫా తొలి శాంతి బహుమతి లభించిన వేళ మైమరిచి పోయాడు ట్రంప్.
2026 ఫిఫా వరల్డ్ కప్ కు ముందు ఫిఫా పీస్ ప్రైజ్ ను ఏర్పాటు చేసింది ఫుట్ బాల్ సమాఖ్య. తొలిసారిగా పీస్ ప్రైజ్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఫిఫా.. ఆ పురస్కారాన్ని ట్రంప్ కు ప్రదానం చేసింది. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ పాంటినో.. ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకతను అందుకుంటున్నాడు.
ఫిఫా అధ్యక్షుడిపై విమర్శలు:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిఫా శాంతి బహుమతిని ఇవ్వాలనే నిర్ణయంపై ఫిఫా ప్రసిడెంట్ గియనో ఇన్ ఫ్యాంటినో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఫిఫా వంటి సంస్థలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని.. ఏకక్షంగా సింపతీ, ఒత్తిడి ఆధారంగా బహుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మానవహక్కుల కార్యకర్తలు,అడ్వకోట్లు ఇతర ప్రముఖులు ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు కరీబియన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసిన గంటల విరామంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శిస్తున్నారు. ఒకవైపు శాంతి అంటూనే వివిధ దేశాలపై ఎయిర్ స్ట్రైక్స్ కు దిగటం ఏంటనీ.. అలాంటి వ్యక్తికి పీస్ ప్రైజేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిఫా తొలిసారి ప్రవేశపెట్టి కొత్త అవార్డు వెంటనే విమర్శలకు గురైంది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ఫిఫా ఆంక్షలు విధించడానికి ఇటీవలే నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి మాజీ అధికారి, ప్రముఖ విమర్శకుడు క్రెయిగ్ మోఖిబర్ ఈ బహుమతిని ఖండించారు. నిజంగా సిగ్గుచేటు పరిణామం అని మండిపడ్డారు. ఇన్ఫాంటినో ట్రంప్‌తో ఆకాశానికి ఎత్తుతున్నారని. పాలస్తీనాలో మారణహోమానికి పాల్పడటాన్ని ఫిఫా మద్ధతిస్తుందా..? అని ప్రశ్నించారు. ఫుట్‌బాల్ జర్నలిస్ట్ జాచ్ లోవీ కూడా ట్రంప్ కు ఫిఫా శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ బహుమతిపై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ స్పందించింది. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోలేకపోయాడు కాబట్టి FIFA అతనికి బహుమతిని ఇచ్చింది విమర్శించింది.
