
అహ్మదాబాద్: భారత్లో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు కాల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్లోని బనస్కాంత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.
‘‘బార్డర్ ను దాటి ఇండియాలోకి వస్తున్న ఓ పాకిస్తాన్ వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమై అతడిని వెనక్కి వెళ్లాలని హెచ్చరించాం. అయినప్పటికీ, అతడు వినకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపాం. దీంతో అతడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు” అని అధికారులు పేర్కొన్నారు.
పహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం భారత్–పాక్ సరిహద్దులో చొరబాట్లు పెరిగాయి. దీంతో బార్డర్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ నెల ప్రారంభంలోను ఇలాంటి సంఘటనే జరిగింది. పంజాబ్ ఫిరోజ్‌పూర్ సమీపంలో బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తానీయుడిని బీఎస్ఎఫ్ బలగాలు కాల్చి వేశాయి.