విదేశాల నుంచి అమెరికా వచ్చి ఉద్యోగం చేసే వలస కార్మికులకు ఇచ్చే హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ లక్ష డాలర్ల రుసుముతో కఠిన నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలా ఏళ్లుగా అమెరికా అందించే హెచ్1బీ వీసాలతో ఇండియన్ టెక్కీలను అమెరికాలో రిక్రూడ్ చేసుకుంటూ తమ ప్రాజెక్టులు చేపట్టిన ఐటీ సేవల కంపెనీలు ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. యూఎస్ చర్యలతో చేసేది లేక స్థానిక అమెరికన్లను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో దేశీయ టాప్ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ ఖర్చులు సెప్టెంబర్ క్వార్టర్లో సబ్ కాంట్రాక్ట్ ఖర్చులు భారీగా పెరిగినట్లు వెల్లడైంది. దీని తర్వాత టెక్ మహీంద్రా కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్ చేసింది. అయితే అతిపెద్ద టెక్ కంపెనీ టీసీఎస్ మాత్రం అత్యల్పంగా సబ్ కాంట్రాక్టులపై ఆధారపడుతుండటంతో ఖర్చులు మెుత్తం ఆదాయంలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
ప్రధానంగా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్, ప్రాజెక్టు అవసరాలకు కొన్ని ప్రాంతాల్లో అవసరాల కారణంగా ఖర్చులు పెరిగినట్లు తేలింది. మెుత్తానికి యూఎస్ హెచ్1బీ వీసా ప్రాసెసిండ్ ఫీజులను పెంచేయటంతో చేసేలి లేక ఇండియన్ టెక్ సంస్థలు అక్కడి స్థానిక సబ్ కాంట్రాక్టర్లకు ఆన్ సైట్ వర్క్ అప్పగిస్తున్నాయి. గతంలో ఈ హెచ్1బీ వీసాల్లో సగానికి పైగా ఇండియానే పొందేది. కానీ ప్రస్తుతం కథ పూర్తిగా మారిపోయింది ట్రంప్ చర్యలతో.
అయితే భారత ఐటీ కంపెనీలు మారిన పరిస్థితుల్లో అమెరికాలో ఫుల్ టైం ఉద్యోగులను నియమించుకోకుండా సబ్ కాంట్రాక్టులు ఇస్తూ కొంత మేర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. డీల్ గడువులో మార్పులు, అస్థిరంగా ఉన్న డిమాండ్ వాతావరణం, ఏఐ విస్తృత వినియోగం వంటి మార్పులు ఇలా సబ్ కాంట్రాక్టర్లకు పని అప్పగించటానికి కారణాల్లో కొన్ని అని వెల్లడైంది. కంపెనీలు కూడా ఎక్కువగా 6-9 నెలల్లో పూర్తయ్యే షార్ట్ టర్మ్ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తూ.. నెమ్మదించిన డిమాండ్ వాతావరణానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి.
