
సికింద్రాబాద్, వెలుగు: ఏ దేశ అభివృద్ధిలోనైనా మౌలిక సదుపాయాలదే కీ రోల్ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మౌలాలిలోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై రెండ్రోజుల పాటు నిర్వహించిన జాతీయ వర్క్‌షాపు మంగళవారం ముగిసింది.
చీఫ్‌గెస్టుగా హాజరైన జీఎం మాట్లాడుతూ.. ప్రపంచ పోటీతత్వాన్ని సాధించేందుకు సమర్థమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్ కీలకమని, ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌తోనే పరిష్కరించే చాన్స్ ఉందని తెలిపారు. ప్రాజెక్ట్‌ల ప్రణాళిక మంజూరుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రధానమంత్రి జీఎస్ పోర్టల్‌నుసమర్థవంతంగా వినియోగిస్తుందని పేర్కొన్నారు. వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సుమిత దావ్రా ప్రధానమంత్రి గతిశక్తిపై పవర్పాయింట్ప్రజెంటేషన్ఇచ్చారు. ఈ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ , ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు