సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం

సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం

పనిచేయించుకోకుండా జీతాలిస్తే.. ప్రజాధనం వృథా అయినట్లే అని వ్యాఖ్యానించింది హైకోర్టు. ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారించింది. పోస్టింగులు లేకుండానే జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుచేయకుంటే.. మార్చి 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది హైకోర్టు. వెయిటింగ్ ఎంత మంది ఉన్నారు... ప్రభుత్వ చర్యలేమిటో.. నివేదిక ఇవ్వాలంది హైకోర్టు. పిల్ పై విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.

వరంగల్ లో మంత్రులను అడ్డుకున్న రైతులు

హామీల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారు